![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఏ దేవి వరమో నీవు Ye Devi Varamo Neevu . ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ 40 లో..... అంజలి ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందనే విషయం రత్నంకి తెలిసి ఎమోషనల్ అవుతుంది. అంజలిని తీసుకొని వస్తే తప్ప ట్యాబ్లెట్ వేసుకోనని చెప్తుంది. దాంతో అంజలి కోసం మనిష్ వెళ్తాడు. వర్షంలో అంజలి తడుస్తూ కన్పిస్తుంది. అది మనిష్ చూసి తన షర్ట్ తనపై కప్పుతాడు. మా నానమ్మ నీ గురించి టెన్షన్ పడుతుంది ఇంటికి వెళదాం పదా అని అంజలితో మనీష్ అంటాడు.
నేను రానని అంజలి చెప్తుంది. నానమ్మ ఇప్పుడు నువ్వు రాకుంటే ట్యాబ్లెట్ కూడా వేసుకోదంట అని మనీష్ చెప్పగానే అంజలి వస్తుంది. అంజలి రాగానే రత్నం హ్యాపీగా ఫీల్ అవుతుంది. ట్యాబ్లెట్ వేసుకుంటుంది. రత్నంని తీసుకొని అంజలి లోపలికి వెళ్తుంది. ఈ విషయం గీతకి చెప్పండి అని కమల అంటుంది. ఇప్పుడే వద్దు అమ్మ అని మనీష్ అంటాడు. అవును ఇప్పుడు అమ్మ హెల్త్ ఇంపార్టెంట్ అని శంకర్ అంటాడు.
ఆ తర్వాత అంజలితో రత్నం మాట్లాడుతుంది. మీ అమ్మ ఎవరో తెలియనప్పుడు బాధపడ్డావ్.. ఇప్పుడు తెలిసాక ఎందుకు ఇలా చేస్తున్నావ్.. నువ్వు మీ అమ్మ మనసు గెలువు.. నీకు సపోర్ట్ గా నేను ఉంటానని రత్నం అనగానే అంజలి సరే అంటుంది. తరువాయి భాగంలో ఆ రోజు నేను చెప్పినట్లు చెయ్యను అన్నావ్ కదా అని మనీష్ అనగానే ఇప్పుడు చేస్తాను గీతంజలి గారికి సారీ చెప్తానని అంజలి అంటుంది. మీడియా ముందుకి వెళ్ళి ఆ రోజు తప్పంతా నాదే అని అంజలి చెప్తుంది. అదంతా గీత టివీలో చూస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |